ఛత్తీస్‌గఢ్: సుకుమా జిల్లా బుర్కాపాల్‌లో మావోయిస్టులు బందీలను విడుదల చేశారు. దీంతో అన్ని గ్రామాల ప్రజలు ఇళ్లకు తిరిగి వచ్చారు. మూడు రోజుల క్రితం తాడిమెట్ల గ్రామానికి చెందిన మాడావి గంగతో పాటు మరో 14 మంది గ్రామస్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
నిన్న మావోయిస్టులు బహిరంగ కోర్టు సెషన్ తర్వాత ఇన్‌ఫార్మర్ల పేరుతో డిప్యూటీ ఎంపీపీ మడావి గంగ, ఉపాధ్యాయురాలు కవాసి సుక్కలను హత్య చేశారు. మావోయిస్టులు అదుపులోకి తీసుకున్న 13 మందిని విడిచిపెట్టడంతో బందీల కుటుంబాలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
