ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బందా జిల్లా కమాసిన్ రోడ్డులోని బాబేరుకొత్వాలి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టింది. దీంతో 7 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జు అయిందని బండ డీఎం దుర్గాశక్తి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ | బండాలో వేగంగా వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో 6 మంది మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
8 మందితో వెళ్తున్న కారు వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టింది. 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించిన 3 మందిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. వారు… pic.twitter.com/LDcVAszLEl
— ANI UP/ఉత్తరాఖండ్ (@ANINewsUP) జూన్ 29, 2023
