మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు శనివారం తెరుచుకున్నాయి. త్రీ కమిటీ సభ్యులు సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రజిత్, ఈఈ బన్సోద్, డీఈఈ ఆర్ఆర్ పటోదార్, ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్పీ ఈఈ చక్రపాణి, ఏఈఈ వంశీలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేటు ఎత్తారు.

- అక్టోబర్ 28 వరకు నీటిని విడుదల చేయండి
మెండోలా/బాసర, జూలై 1: మహారాష్ట్రలోని గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు గేట్లు శనివారం తెరుచుకున్నాయి. త్రీ కమిటీ సభ్యులు సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రజిత్, ఈఈ బన్సోద్, డీఈఈ ఆర్ఆర్ పటోదార్, ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్పీ ఈఈ చక్రపాణి, ఏఈఈ వంశీలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేటు ఎత్తారు.
ప్రాజెక్టు నుంచి 0.473 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. సాయంత్రానికి ఈ జలాలు తెలంగాణ సరిహద్దులోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమానికి చేరుకుంటాయి. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంటాయని ఈఈ చక్రపాణి తెలిపారు. శనివారం రాత్రి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాలు 1,091.00 అడుగులు (90.313 టీఎంసీలు), 1,064.90 అడుగులు (20.068 టీఎంసీలు) ఉన్నట్లు ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్పీ అధికారులు తెలిపారు.

