హైదరాబాద్: రుతుపవన పరిస్థితులతో దేశవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సీఎం కేసీఆర్ సచివాలయంలో మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కాళేశ్వరం సహా గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోయడం ద్వారా రిజర్వాయర్లలో తగినంత నీరు ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కష్టకాలంలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ, జలసంరక్షణ శాఖ ఇంజినీర్ల సూచనలు, సలహాలు పాటించి పంటలు పండించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల సుమన్, జాజుల సురేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశం.
