ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం ఈరోజు (సోమవారం) ఉదయం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిపిన తనిఖీల్లో కెన్యా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.9 కేజీల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ చెక్‌పాయింట్ దగ్గర డఫెల్ బ్యాగ్ అడుగున దాచిన కొకైన్‌ను పోలీసులు గుర్తించారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.129.8 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ముంబై ఎయిర్‌పోర్టులో రూ.129.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిన విషయం తెల్సిందే.
