జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు (బుధవారం) తనమండి ప్రాంతంలో ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను వాహనం నుంచి రక్షించి రాజౌరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు అనుబంధ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని చెప్పారు.
