తెలంగాణ | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వీ భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లికి చెందిన మటం భిక్షపతి నియమితులయ్యారు.

తెలంగాణ | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వీ భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనూవత్కు చెందిన మహ్మద్ సలీం నియమితులయ్యారు.
తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లికి చెందిన మటం భిక్షపతి నియమితులయ్యారు. తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మహ్మద్ తన్వీర్ నియమితులయ్యారు. వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

