మహబూబ్నగర్ జిల్లా: జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొత్త సభ్యులను బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల హయాం నుంచి బీఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ ఎస్ పార్టీలో చేరినట్లు కొత్త సభ్యులు వెల్లడించారు.
ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పొందాయన్నారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, అందరూ కలిసికట్టుగా పనిచేసి సమన్వయంతో పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు.
The post కారెక్కిన 50+ కాంగ్రెస్ నేతలు appeared first on T News Telugu.
