సంగారెడ్డి: జహీరాబాద్ అంతర్రాష్ట్ర ఎక్సైజ్ చెక్‌పోస్టులో భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్‌పల్లి జీఎస్టీ చెక్‌పాయింట్‌లో ఓ కారులోని రెండు పెట్టెల్లో రెండు కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు లేకుండానే ముంబై నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారాన్ని తరలించినట్లు అధికారుల విచారణలో తేలింది. పట్టుబడిన బంగారం విలువ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం తరలించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
