మణిపూర్‌లో భూకంపం. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12:14 గంటలకు రాష్ట్రంలోని ఉక్రుల్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూమి లోపల 70 కిలోమీటర్ల లోతులో కదలిక వచ్చిందని చెబుతున్నారు.
భూకంప కేంద్రం ఉక్రుల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అర్ధరాత్రి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
