దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ (శనివారం) ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా కాలనీలన్నీ నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షం కారణంగా మింటో వంతెన సమీపంలోని అండర్‌పాస్‌ను అధికారులు మూసివేశారు. భారీ వర్షాల సమయంలో రిడ్జ్ ప్రాంతంలో 11.1 సెం.మీ, సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 9.8 సెం.మీ, లోధి రోడ్ ప్రాంతంలో 9.2 సెం.మీ వర్షం కురిసింది.
