
ఎస్టీఎల్‌లో ఔత్సాహిక ప్రతిభను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సృజనాత్మక కార్యక్రమం. “ముఖ్యమంత్రి షెడ్యూల్డ్ ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ (CMSEII)”. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ గిరిజన సంక్షేమ శాఖ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో లబ్ధిపొందిన ఆదివాసీ గిరిజన మహిళలు, యువకుల విజయగాథలు, సాధించిన ప్రగతి సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తుంది.
తాజాగా మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, నేషనల్ ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ రమావత్ వాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
