తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తోమాల సేవకు హాజరయ్యారు.

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తోమాల సేవకు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు గడ్కరీ దంపతులకు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జ్ఞాపిక, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు తనకు సాధికారత కావాలని అన్నారు.
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో జరిగే సభకు మంత్రి నితిన్ గడ్కరీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ రహదారులను దేశానికి అంకితం చేశారు.
#చూడండి | ఆంధ్ర ప్రదేశ్ | ఈరోజు తెల్లవారుజామున, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరియు అతని కుటుంబ సభ్యులు “తోమాల సేవ” కార్యక్రమంలో పాల్గొని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం) శ్రీ వేంకటేశ్వరునికి నివాళులు అర్పించారు. pic.twitter.com/pVqWMi6gnX
– ఆర్నీ (@ANI) జూలై 13, 2023

