
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన జగదీష్ (21) ఎల్ గడలోని బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు ముందురోజు రాత్రి గదిలోనే ఓ యువతితో జగదీష్ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
