ఇండోర్: ప్లాస్టిక్ వ్యర్థాల నుండి స్వచ్ఛమైన హైడ్రోజన్‌ను సులభంగా మరియు సమర్ధవంతంగా ఉత్పత్తి చేసే ప్రక్రియను ఐఐటీ ఇండోర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్ ముప్పును ఎదుర్కోవడమే కాకుండా, వారి పద్ధతి వ్యర్థాల నుండి ఆదాయాన్ని సంపాదించడంలో కూడా సహాయపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు|
ఇండోర్: ప్లాస్టిక్ వ్యర్థాల నుండి స్వచ్ఛమైన హైడ్రోజన్‌ను సులభంగా మరియు సమర్ధవంతంగా ఉత్పత్తి చేసే ప్రక్రియను ఐఐటీ ఇండోర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) ప్లాస్టిక్‌ను సింగిల్ యూజ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మూడేళ్ల పరిశోధనల తర్వాత ఈ పీఈటీ వ్యర్థాల నుంచి స్వచ్ఛమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుగొన్నామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ ముప్పుకు పరిష్కారాలు అందించడంతో పాటు వ్యర్థాల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు తమ విధానాలు దోహదపడతాయని అంటున్నారు. 2019-20లో దేశంలో దాదాపు 3.47 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయని కేంద్ర ప్రభుత్వం గతేడాది లోక్‌సభలో వెల్లడించింది. ఐఐటీ ఇండోర్‌కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ కె సింగ్ మాట్లాడుతూ.. తాము అభివృద్ధి చేసిన విధానంతో 33 కిలోల పీఈటీ ప్లాస్టిక్ నుంచి 1 కిలోల స్వచ్ఛమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.

