తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రస్థాయి అండర్ -19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు.

మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రస్థాయి అండర్ -19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో రుషీంద్ర చాంపియన్‌గా నిలవగా, నుమైర్, ప్రణవ్‌రావు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను తన్వరెడ్డి గెలుచుకుంది. విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, అడిషనల్ కలెక్టర్ రాహుల్, మున్సిపల్ చైర్మన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

