
హైదరాబాద్: వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్‌రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టు సమన్లు జారీ చేసింది. వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని ఆగస్టు 14న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
వివేకా హత్య కేసులో అనుబంధ ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు ఈ మేరకు సమన్లు జారీ చేసింది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలపై సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది.
