ఢిల్లీలో వర్షపాతం తగ్గుముఖం పట్టడంతో యమునా నది నీటిమట్టం క్రమంగా పడిపోతుంది. అయితే, వరద ప్రాంతాల్లో ఈత కొట్టడం, సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం మానుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ముకుంద్‌పూర్ జిల్లాలో వరద నీటిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పౌరులకు కేజ్రీవాల్ వార్నింగ్ ఇచ్చారు.
వరద నీటిలో ఈత కొట్టడం, ఆడుకోవడం, సెల్ఫీలు దిగడం వంటివి చేయవద్దని సీఎం కేజ్రీవాల్ సూచించారు. చాలా చోట్ల వరద నీటిలో ఈత కొడుతూ సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీస్తున్నట్లు సమాచారం అందిందని హెచ్చరించారు. ఇవి చాలా ప్రమాదకరమైన ప్రవర్తనలు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
The post వరదల సమయంలో వీడియోలు, సెల్ఫీలు తీసుకోవద్దని ప్రజలను కోరిన సీఎం కేజ్రీవాల్ appeared first on T News Telugu.
