పోలాండ్ రాజధాని వార్సా సమీపంలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రి ఆడమ్ నిడ్జిల్క్సీ ట్విట్టర్లో తెలిపారు.
వార్సాకు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయంలో సెస్నా 208 అనే చిన్న హ్యాంగర్ కూలిపోయింది. దీంతో హ్యాంగర్లో 4 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది.
