సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కార్యాలయంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి అధ్యక్షులు నారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

చిక్కడపల్లి, జూలై 18: సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో నారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలె యాదయ్య, బీఆర్టీయూ చైర్మన్ రాంబాబు యాదవ్, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మిరెడ్డి, బీఆర్ఎస్ యూత్ వింగ్ లీడర్ ముఠా జయసింహ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రూప్ సింగ్, లేబర్ కమిషనర్ నదీమ్ అహ్మద్, అడిషనల్ కమిషనర్ గంగాధర, కమిషనర్ జనరల్ హాజరయ్యారు. కార్యక్రమంలో గంగాధర్, చంద్రశేఖర్, జాయింట్ కమిషనర్ చతుర్వేది, డిప్యూటీ కమిషనర్ శ్యాంసంద్ జాజు పాల్గొని నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి తన ప్రసంగంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి నారాయణ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జాతీయ కనీస వేతన సలహా సంఘం సభ్యులు బి. శివశంకర్, కె. శంకర్ రెడ్డి, ఎం. నర్సింహ, నర్సింహారెడ్డి అధ్యక్షత వహించగా, బిఆర్టియు ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు రాజిరెడ్డి, జయరాజ్, బిఆర్టియు నాయకులు కిరణ్, రమణారెడ్డి, దానకర్ణాచారి, ప్రభాకర్ , వి.లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

