సియోల్: ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు చైనా సముద్ర తీరం వైపు కిమ్ జోంగ్ ఉన్ బలగాలు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించాయని దక్షిణ కొరియా సైన్యం బుధవారం వెల్లడించింది. అమెరికా-దక్షిణ కొరియాల మధ్య భారీ స్థాయిలో ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రయోగం చేపట్టినట్లు చెబుతున్నారు.
తూర్పు చైనా సముద్రంలోకి ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిందని సియోల్ సైన్యం పేర్కొంది. తూర్పు చైనా సముద్రాన్ని జపాన్ సముద్రం అని కూడా అంటారు. అయితే, గత వారం జపాన్‌పై క్షిపణిని ప్రయోగించడం ఇది రెండోసారి. గత నెల 28వ తేదీన కూడా ఇదే తరహాలో తూర్పు చైనా సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
కాగా, గత నెలలో ఉత్తర కొరియా జరిపిన ఎనిమిదో క్షిపణి ప్రయోగం ఇది. ఉత్తర కొరియా జపాన్ మీదుగా ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణిని ప్రయోగించిన రెండు రోజుల తర్వాత దాదాపు ఐదేళ్లలో తొలిసారిగా అక్టోబర్ 4న బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరిగింది.
822252