
పుణె: దేశంలో టమాటా ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతుండగా.. కొందరు రైతులను లక్షాధికారులను చేసింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఓ రైతు టమోటాలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడయ్యాడు. పఖ్‌గఢ్ జిల్లాలో ఈశ్వర్ గయ్కర్ (36) అనే రైతు జూన్ 11 నుండి జూలై 18 వరకు టమోటాలు అమ్మడం ద్వారా రూ.30 కోట్లు సంపాదించాడు.
పొలంలో ఇంకా కొన్ని పంటలు మిగిలి ఉన్నాయని, వాటిని విక్రయిస్తే మరో రూ.5 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. మొత్తంగా 18,000 బాక్సుల (ఒక్కొక్కటి 20కిలోలు) టమాటాలను రూ.700 నుంచి 2,200 ధరకు విక్రయించినట్లు తెలిపారు. 12 ఎకరాల పొలంలో సాగు చేసిన టమాట సాగుకు మొత్తం రూ.40 లక్షలు ఖర్చయిందని తెలిపారు. టమాట సాగులో ఎన్నో ఒడిదుడుకులు చూశానని.. ఈ ఏడాది మేలో ధర అతి తక్కువగా ఉండడంతో రవాణా ఖర్చుల కారణంగా అధిక మొత్తంలో టమాటాను పారేశానన్నారు. ఆ నెలలో టమాటా పెట్టె ధర రూ.50 (కిలో రూ.2.50) మాత్రమే ఉందని, 2021లో రూ.1.516 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ఈసారి లక్ష్మీ తక్షాన్ని పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
