హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, రేపు (శుక్ర, శనివారాలు) రెండు రోజులు సెలవు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.
మందులు, పాలు వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం తెలిపారు. ఇదే సందర్భంలో… ప్రైవేట్ సంస్థలు కూడా ఆయా కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
