
కోల్కతా: గుజరాత్లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలి 142 మంది మృతి చెందిన ఘటనకు బాధ్యులైన వారిపై ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమ ప్రతాపాన్ని సామాన్యులకు మాత్రమే చూపిస్తున్నారని ఆమె విమర్శించారు.
ప్రధాని స్వగ్రామంలో ప్రమాదం జరిగినంత మాత్రాన ఆయన గురించి, రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు మమత సమాధానమిచ్చారు. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం కాబట్టి ఈ విషయంపై తాను వ్యాఖ్యానించబోనని అన్నారు.
మోర్బీ రోప్ బ్రిడ్జి ప్రమాదంలో జరిగిన భారీ ప్రాణనష్టంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు పరిధిలో విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ కోరారు.
822742
