సికింద్రాబాద్ కౌన్సిల్ హెడ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు థ్రిల్ సిటీ, పీవీ మార్గ్‌లో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద 3డి స్క్రీన్‌పై వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీలు గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు “గిఫ్ట్ ఆఫ్ స్మైల్” కార్యక్రమంలో భాగంగా 1000 మంది కెమెరామెన్లకు ఆరోగ్య బీమా పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, చైర్మన్ అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
The post పీవీ మార్గ్ థ్రిల్ సిటీలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుక appeared first on T News Telugu.
