నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ గోదాం సమీపంలోని వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
మృతులు నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామానికి చెందిన భీముడు, బక్కయ్యగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూల్ నుంచి స్వగ్రామం గగ్గలపల్లికి సైకిల్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
The post నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి appeared first on T News Telugu