తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సోమ భరత్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ స్లిప్ అందుకున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. డెయిరీ డెవలప్‌మెంట్ సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా తనను నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సోమ భరతకుమార్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
The post టీఎస్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా సోమ భరతకుమార్ appeared first on T News Telugu.