శ్రీశైల మహాక్షేత్రంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తీక మాసం, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వాహనాల రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు పెరగడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో శ్రీశైలం టోల్ గేట్ నుంచి ముఖద్వారంలోని సాక్షి గణపతి వరకు సుమారు 10కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు.
