బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ నిర్ణయం తీసుకున్నాడు. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. అప్పటికి కెమెరాలు ఉండవని స్పష్టం చేశారు. తాను గత 35 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నానని, అయితే ఏదో మిస్ అయ్యాననే బాధ తనకు ఉందని అన్నారు. సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని తన తల్లి, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు.
అలాగే.. అమీర్ తన కొత్త ప్రాజెక్ట్ “ఛాంపియన్స్”ని రివీల్ చేశాడు. ఈ చిత్రానికి తానే నిర్మాత కూడా అని చెప్పారు. తాను సినిమాలో నటించకపోయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కొనసాగుతానని, మరో నటుడితో కలిసి సినిమా పూర్తి చేసేందుకు సహకరిస్తానని చెప్పారు.
