కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. పథకాలు పొందేందుకు ప్రజలు క్యూ లైన్లలో నిలబడి మరీ దరఖాస్తులు ఇచ్చారు. డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రొగ్రాం జనవరి 6వ తేదీన ముగిసింది. ఇప్పటి వరకు కోటి 24 లక్షల మంది ప్రజలు ఆరు గ్యారెంటీల కోసం అప్లయ్ చేసుకున్నారు. ఇంత సీరియస్గా జరిగిన ఈ కార్యక్రమంలోనూ ఆకతాయిలు కొందరు తమ అతి తెలివి ప్రదర్శించారు. మొన్నటికి మొన్న హనుమకొండ జిల్లాలో ఓ వ్యక్తి శివుడి పేరు మీద అభయ హస్తం పథకం కోసం దరఖాస్తు చేశాడు. అదే రీతిలో తాజాగా మరో విచిత్ర దరఖాస్తు బయటకొచ్చింది.
Read Also: టీవీ లైవ్ షోలో గన్లు, బాంబులతో బెదిరింపులకు దిగిన డ్రగ్ ముఠా
ఈ సారి ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ల పేర్లు రాసి ఉంచారు. ఇక కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి అభయహస్తం దరఖాస్తు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభుత్వ పథకాల కోసం సామాన్యులు అందరు బాధపడుతుంటే.. ఆకతాయిలు మాత్రం ఇలాంటివి చేస్తున్నారు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
The post అభయహస్తం కోసం సోనియా గాంధీ దరఖాస్తు! కొడుకులుగా రేవంత్, భట్టి, ఉత్తమ్.. appeared first on tnewstelugu.com.
