Kesineni Nani | ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.
అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని నాయకులు అంతే వేగంగా పావులు కదుపుతూ పక్క పార్టీలో పాగా వేస్తున్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేశినేని నాని (Kesineni Nani) కి ఈసారి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వడం లేదని స్పష్టమైన సంకేతాలు టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నాని కూతురు శ్వేత టీడీపీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ వీరిద్దరూ ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో బుధవారం మధ్యాహ్నం తండ్రీ, కూతురు ఇద్దరు ఏపీ సీఎం జగన్‌తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటి అయ్యారు. వీరి కలయిక విజయవాడ రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
