కాంగ్రెస్(Congress) పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. ఎన్నికల్లో గెలువడమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన ఆ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు.
ఇక ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఉద్యమాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. ఆ పార్టీ విధానాలు చూస్తుంటే భవిష్యత్లో ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ రావడం ఖాయమన్నారు.