పోడు రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. జిల్లాలోని ఎర్రబోడు, మాణిక్యారంలో అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించారని ఆరోపిస్తూ పోడు రైతులపై కేసులు నమోదు చేశారు. దీంతో కారేపల్లిలో అటవీ అధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇక పోడు రైతులను అరెస్ట్ చేసేందుకు పోలీసలు, అటవీ అధికారులు రావడంతో సీపీఎం నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి సాగుకు సహకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతున్నదని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
The post పోడు రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం appeared first on tnewstelugu.com.
