తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సదుపాయం కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్న బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో కొత్తగా 275 కొత్తబస్సులను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.
ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన 80 బస్సులు రోడ్డెక్కాయి. ఈ ఏడాది జులై నాటికి వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్కార్ ప్రారంభించిన మహాలక్ష్మీ పథఖం కింద రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో జులై అందుబాటులోకి రానున్న వెయ్యి బస్సులు అదనంగా మరో 275 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అటు ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియమాకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా రిక్రూట్ చేసుకోనుంది. ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కి సినిమా ఇంకా స్టార్ట్ కాలే.. అసలు సినిమా ముందుంది
