న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెళుతున్న వాహనం అనంత్‌నాగ్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఖనాబాల్‌లో అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: యూట్యూబ్ ఇండియాకు నోటీసులు
పోలీసుల కథనం ప్రకారం.. ముఫ్తీ వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భద్రతా అధికారి గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముఫ్తీ సురక్షితంగా బయటపడ్డారు. కారు ప్రమాదానికి గురైనట్లు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ వెల్లడించారు.
