హైదరాబాద్: ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణ కాపాడుకోవాలి అని కేసీఆర్ కృషి చేశారు. తెలంగాణ వచ్చిన నాడు ఎలాంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఓటమి చెందాం. బాధ పడవలసిన అవసరం లేదు.’’ అని పార్టీ నాయకులలో మాజీమంత్రి హరీష్ రావు భరోసా నింపారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని పేర్కొన్నారు.
Also Read.. బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ ను ఎదుర్కోవడం ఓ లెక్కా?
‘‘మహబూబ్ బాద్ మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్. ఒక్క మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్నిటిలో అభివృద్ధి చేశారు. అడిగినా అడగకున్నా కేసీఆర్ ఎంతో చేశారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసింది. మీరు కూడా చర్చ చేయాలి. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణ మాఫీ అని మాట తప్పారు. వడ్ల కొనుగోలు బోనస్ అన్నారు. మాట తప్పారు. అన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు మాట తప్పి దగా చేశారు.
Also Read.. పాస్పోర్ట్ ర్యాంకులు: ఇండియా స్థానం ఎంతో తెలుసా?
నాగార్జున సాగర్ కింద పంటకు నీళ్ళు ప్రశ్నార్థకం అయ్యాయి. నిరుద్యోగ భృతి మేము అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారు. కరెంట్ ఇవ్వడం లేదు. విద్యుత్ కోసం కొత్త విధానం తెస్తా అంటారు. ఇప్పటికే 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇచ్చింది వాస్తవం కాదా.. కొత్త విధానం అంటే 48 గంటల కరెంట్ ఇస్తారా. నాడు ఉచిత విద్యుత్ అని కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేసింది వాస్తవం కాదా. కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేయడం లేదని జనం రివర్స్ అయ్యారు.
Also Read.. ఢిల్లీలో భారీ భూకంపం. భయంతో పరుగులు తీసిన ప్రజలు!
రాబోయే ఎంపీ ఎన్నికల్లో అందరం కష్టపడాలి. మీరు చెప్పిన అంశాలు ప్రతిదీ చర్చిస్తాం. నెల అయితే కేసిఆర్ కూడా తెలంగాణ భవన్ లో ఉంటారు. అందరం ఇక్కడే ఉంటాం. ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తాం. మొదటి కేబినెట్ లో మొదటి డీఎస్సీ అన్నారు ఏమైందీ. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. వారిది వారికే పడటం లేదు. జరగాల్సిన దాని గురించి ఆలోచన చేద్దాం. భవిష్యత్ మనదే. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ మనది. గెలుపు ఓటమి కొత్త కాదు.
Also Read.. కరీంనగర్ డిపోలో కోడిపుంజు వేలం.. అధికారుల నోటీసులు
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ తేలేదు. ఒక్క ప్రయోజనం తేలేదు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్ వల్లనే సాధ్యం అవుతుంది. గల్లీలో ఎవరు ఉన్నా, డిల్లీలో ఎవరు ఉన్నా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలవాలి. 100 రోజుల్లో హామీల అమలు అన్నది కాంగ్రెస్ పార్టీ. దరఖాస్తుల కథతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఇంకా 6 గ్యారెంటీల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. చెప్పిన హామీలు అమలు చేయక అవినీతి చేశారు అని డ్రామాలు చేస్తున్నారు.
Also Read.. మహిళల ఫ్రీ బస్ జర్నీపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్
కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మొన్న శాసనసభలో కాంగ్రెస్ కి చూపెట్టింది ట్రెలర్ మాత్రమే. ముందు ముందు అసలు సినిమా ఉంటది. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తాము. అక్రమ కేసుల నుండి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. జిల్లా కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటది. 420లో కాంగ్రెస్ వాళ్లు ఛారాన మందం కూడా చేయరు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. గోబెల్స్ ప్రచారం బండారం బయట పడుతుంది. మండల, జిల్లా కమిటీలు వేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం.’’ అని హరీష్ రావు అన్నారు.
