హైదరాబాద్: ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్‌ఆర్టీసీ అలర్ట్ జారీ చేసింది. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, తొర్రూరు వైపునకు వెళ్లే బస్సుల స్టాప్స్ ను మార్చింది. యాదగిరిగుట్ట, తొర్రూర్ బస్టాప్‌లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి ఆర్టీసీ మార్చినినట్టు ఆర్టీసీ వెల్లడించింది.
Also Read.. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
అయితే, హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు మాత్రం యథావిధి స్థానంలో ఆపనున్నట్లు తెలిపింది. మహాలక్ష్మీ పథకం నేపథ్యంలో బస్సుల్లో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ సంక్రాంతికి రెగ్యులర్, స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్‌ల నుంచే బయలుదేరతాయని అన్నారు.
The post ఉప్పల్ నుంచి సొంతూళ్లకు వెళుతున్నారా.. టీఎస్‌ఆర్టీసీ అలర్ట్ appeared first on tnewstelugu.com.
