హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హద్దుల్లేని హామీలు ఇచ్చిందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చుకపోతే ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. శుక్రవారం ఆమె తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
Also Read.. మెహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఈరోజు జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో పార్టీ నిర్మాణంపై చర్చ జరిగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని పేర్కొన్నారు.
Also Read.. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అవుతోందన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని మాజీమంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని అని అన్నారు.
The post రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం appeared first on tnewstelugu.com.
