17వ లోకసభ చివరి సమావేశాలు జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈనెల 31 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీని కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఈరోజు ప్రకటించారు.
#InterimBudgetSession2024, last session of Seventeenth Lok Sabha to be held from 31st January to 9th February, with address of Hon’ble President to the Parliament. On 1st February, Hon’ble FM @nsitharaman ji will present the Interim Union Budget. pic.twitter.com/fF0yzblsgU
— Pralhad Joshi (@JoshiPralhad) January 12, 2024
ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. మేలో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 17వ లోకసభ గడువు జూన్ 16న ముగిస్తుంది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ సమావేశం అవడం ఇదే చివరిసారి.
ఇది కూడా చదవండి: ఈ వ్యాధులు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు..!!
