శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీ టీం కాదు. బీజేపీతో పొత్తు గతంలో లేదు భవిష్యత్ లో ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చెందిన ముగ్గురు ఎంపీలను , ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడించింది బీఆర్ఎస్. కేసీఆర్ 45 యేండ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవిత పై కేసు పెట్టేదా ?. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీం కోర్టు జోక్యం తప్ప బీజేపీ తో సంబంధాలు కారణం కాదు.
కాంగ్రెస్ బీజేపీ లు కుమ్మకై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాయి. ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక్కట్టయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అనే వారు శంకరాచార్యులు పీర్ల పండగకు ముడి పెడుతున్నట్టు లెక్క. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారు. అమిత్ షా ను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉపఎన్నికల పద్దతి మారింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హై కోర్టుకు వెళ్లినా మాకు నిరాశ తప్పలేదు. బీజేపీ మతాన్ని రాజకేయం కోసం వాడుకుంటోంది. మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ ,భువన గిరిల్లో పంచితే గెలిచే వాళ్ళమేమో.
బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులు అయితే ..కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువు. బీ ఆర్ ఎస్ నిజమైన సెక్యూలర్ పార్టీ. ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదు. పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే పద్ధతి ఉంటుంది. పార్టీ లో క్రమశిక్షణా రాహిత్యాన్ని సాధించం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటో కాల్ ఉల్లంఘనలు సీరియస్ గా తీసుకుంటాం .తప్పుడు కేసులను ఎదుర్కొంటాం. ఒక కాకికి ఆపద వస్తే మిగతా కాకులు ఒక్క చోట చేరినట్టే .బీ ఆర్ ఎస్ కార్యకర్త కు ఆపద వస్తే మిగతా కార్యకర్తలు చేరుకుని అండగా నిలవాలి
