కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతమైంది. ఈ నెల 9న ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న కోడిని శుక్రవారం డిపో-2 మేనేజర్ మల్లయ్య ఆధ్వర్యంలో ప్రముఖ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ బ్లూక్రాస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తూము నారాయణకు అప్పగించారు.
Also Read.. కాంగ్రెస్ ను గెలిపించేందుకు బీజేపీ కుట్ర
ముందుగా పందెం కోడిని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ వన్యప్రాణుల చట్టం ప్రకారం కోడిని వేలం వేయరాదని, జంతు సంరక్షణ కేంద్రాలను అప్పగించాలని ఆర్ఎం సుచరిత దృష్టికి జంతు సంరక్షణ సంస్థ సభ్యులు తీసుకెళ్లారు. పందెం కోడిని హైదరాబాద్ మాదాపూర్ బ్లూ క్రాస్ సంస్థ కేంద్రానికి తరలిస్తామని సంస్థ జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు.
