Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

మలేషియా ఓపెన్‌లో సంచలనం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 13, 2024No Comments

Malaysia Open 2024: గతేడాది ఇదే టోర్నీలో సెమీస్‌ వరకు చేరిన భారత జోడీ.. ఈ ఏడాది మాత్రం పట్టు విడవలేదు. దక్షిణ కొరియా జంట సైతం నువ్వా నేనా అని గట్టి పోటీనివ్వడంతో పోరు రసవత్తరంగా సాగింది.

January 13, 2024 / 05:46 PM IST
Malaysia Open 2024: మలేషియా ఓపెన్‌లో సంచలనం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం

Malaysia Open 2024: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టిలు మలేషియా ఓపెన్‌లో సంచలనం సృష్టించారు. కౌలాలంపూర్‌ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్‌లో భాగంగా శనివారం ముగిసిన పురుషుల తొలి సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ.. 21-18, 22-20 తేడాతో సౌత్‌ కొరియన్‌ జంట కంగ్‌ మిన్‌ హ్యూక్‌ – సీయో స్యూంగ్‌ జే లను ఓడించి ఫైనల్‌కు చేరారు. తద్వారా మలేషియా ఓపెన్‌ డబుల్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారత జోడీగా రికార్డులకెక్కారు. 44 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన ఈ పోరులో సాత్విక్‌ జోడీ.. రెండు సెట్లలోనూ గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.

గతేడాది ఇదే టోర్నీలో సెమీస్‌ వరకు చేరిన భారత జోడీ.. ఈ ఏడాది మాత్రం పట్టు విడవలేదు. దక్షిణ కొరియా జంట సైతం నువ్వా నేనా అని గట్టి పోటీనివ్వడంతో పోరు రసవత్తరంగా సాగింది. రెండో సెట్‌లో ఒకదశలో 11-18గా ఉన్న మన కుర్రాళ్లు.. అనూహ్యంగా పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ఇక ఫైనల్‌లో సాత్విక్‌-చిరాగ్‌లు.. రెండో సెమీస్‌లో వాంగ్‌-లియాంగ్‌ (చైనా), కొబయాషి – హోకి (జపాన్‌) మధ్య జరిగే పోరులో విజేతతో పోటీ పడనున్నారు. ఈ టోర్నీ ఫైనల్‌లో గనక భారత ద్వయం గెలిస్తే సూపర్‌ 1000 విభాగంలో వారికి రెండో టైటిల్‌ కానుంది. గతేడాది ఈ ఇద్దరూ ఇండోనేషియా ఓపెన్‌ సొంతం చేసుకున్న విషయం విదితమే.

 

🇮🇳 #SatChi into the Finals of #MalaysiaOpen2024 🤩
Phenomenal grit to go from 14-20 to 22-20 🔥 @Shettychirag04 and @satwiksairaj take a bow – the epitome of comebacks🤯#PETRONASMalaysiaOpen2024 #Badminton pic.twitter.com/i5Pe7TQ6Q9

— Harini Raman (@ASimpleStardust) January 13, 2024

Previous article

Puri Shankaracharya | నేను అయోధ్య వెళ్లడం లేదు.. నలుగురి శంకరాచార్యుల భిన్నాభిప్రాయాలు లేవు : నిశ్చలానంద సరస్వతి

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.