హైదరాబాద్: మైసూర్ శాండల్ నకిలీ సబ్బులను తయారుచేస్తున్న ముఠాను హైదరాబాద్ మలక్ పేట పోలీసులు అరెస్టు చేశారు. 10,000కు పైగా నకిలీ సబ్బులు, రూ.2 కోట్ల విలువైన తయారీ సామగ్రిని సీజ్ చేశారు.
Also Read.. అమానవీయం. చెత్తకుప్పలో దొరికిన అప్పుడే పుట్టిన మగ శిశువు
కర్ణాటక సర్కారుకు చెందిన KSDL అనే సంస్థకు మైసూర్ శాండల్ సబ్బులపై పేటెంట్ హక్కులు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సబ్బులు మార్కెట్లోకి వస్తున్నట్లు కర్ణాటక మంత్రి పాటిల్.. తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడంతో వారి దందా బయటపడింది.
