Sri Lahari Granth | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు వైష్ణవస్తోత్రాలతో కూడిన శ్రీ
లహరి గ్రంథాన్ని ప్రతి శనివారం బ్రేక్ దర్శనంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అందివ్వాలని
సంకల్పించినట్లు ఈవో రామకృష్ణరావు వెల్లడించారు.
Sri Lahari Grantham | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు వైష్ణవస్తోత్రాలతో కూడిన శ్రీ
లహరి గ్రంథాన్ని ప్రతి శనివారం బ్రేక్ దర్శనంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అందివ్వాలని
సంకల్పించినట్లు ఈవో రామకృష్ణరావు వెల్లడించారు. ప్రముఖ రచయిత శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక
సలహాదారులు శ్రీనివాస్ రచించి, సంకలనం చేసిన శ్రీ లహరి ప్రత్యేక గ్రంథాన్ని భోగి సందర్భంగా
లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం ఆవిష్కరించారు.
గ్రంథాన్ని తొలి ప్రతిని డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర శర్మకు అందజేశారు. వైష్ణవ శోభతో అత్యంత శక్తివంతంగా అందిన శ్రీలహరి భక్తజన కోటికి ఒక మంత్రపుష్పమని రామకృష్ణారావు ప్రశంసించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ రచయిత శ్రీనివాస్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదా ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ మినర్వా హోటల్స్ గ్రూప్‌కు చెందిన రవి, శ్రీనివాస్, అనిత తదితరులు హాజరయ్యారు.
