హైదరాబాద్: ఏపీలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. పంట పొలాలు, మామిడితోటలు కోండిపందేలకు కేంద్రంగా మారాయి. కోడిపందేలపై నిర్వహించవద్దని ఏపీహైకోర్టు ఆదేశాలు ఉన్నా.. పోలీసుల తనిఖీలు చేస్తున్నా.. పందెలు మాత్రం జోరుగా జరుగుతున్నాయి.
Also Read.. మున్సిపల్ కార్మికులను సన్మానించిన హరీష్ రావు
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో భారీ స్థాయిలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చే వారి కోసం విశాలమైన పార్కింగ్ స్థలాలు, వీఐపీలు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినిమా సెట్టింగ్లను తలపించేలా స్వాగత ద్వారాలు, బౌన్సర్లు, సందర్శకులకు పాస్లు, ఆటగాళ్లకు టోకెన్లు, చేతి కంకణాల వంటి ఏర్పాట్లు చేశారు. పందేల మొదటి రోజే రూ.లక్షల్లో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక మహారాష్ట్ర, ఒడిశాతో పాటు రాయలసీమ ప్రాంతం నుంచి వందల సంఖ్యలో కార్లలో పందెం రాయుళ్లు తరలిరావడంతో ఏపీలో సంక్రాంతి సందడి నెలకొన్నది.
The post భోగి రోజున కత్తులు దూసిన పందెం కోళ్లు appeared first on tnewstelugu.com.
