హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన తాజా యాక్షన్ డ్రామా జైలర్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెరవెనుక వీడియోను నిర్మాత తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్ అద్భుతంగా కనిపించారు.
ఇక్కడ సూపర్ స్టార్ యొక్క సంగ్రహావలోకనం ఉంది @రజినీకాంత్ సెట్ నుండి #జైలర్
@నెల్సోండిల్‌కుమార్ @anirudhofficial pic.twitter.com/3EtAap0FUs
– సన్ పిక్చర్స్ (@sunpictures) నవంబర్ 18, 2022
ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగి బాబు, వసంత్ రవి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
‘జైలర్’ మేకింగ్ గ్లింప్స్.. రజినీకాంత్ లుక్ అద్భుతం appeared first on T News Telugu.

