హైదరాబాద్: పులియబెట్టిన ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించింది. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన ఆహార పదార్థాలపై తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం మరోమారు తేలిందని పేర్కొన్నది. ఆహారానికి పెరుగు కలిపి.. కలపకుండా రెండు వేర్వేరు అధ్యయనాలు చేసినట్లు తెలిపింది.
Also Read.. ఈజ్యూస్ తాగుతే హైబీపీ కంట్రోల్ అవుతుంది..ఒత్తిడి తగ్గుతుంది..!!
వండిన ఆహారం కంటే పులియబెట్టిన ఆహారంలో ప్రొటీన్లు, మైక్రోన్యూట్రిషన్ల పరిమాణం పెరిగినట్టు వెల్లడించింది. అందులో ఐరన్, జింక్, సూక్ష్మ పోషకాలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది. తృణధాన్యాలను సంప్రదాయక పద్ధతుల్లో వండుకోవడం మంచిదని, దీనివల్ల పోషకాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు.
