Tammineni Veerabhadram | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.

తమ్మినేని వీరభద్రం ఖమ్మం నుంచి వెంటిలేటర్ సపోర్టుతోనే ఆస్పత్రికి వచ్చారని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతానికి మందులతోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, తమ్మినేని అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయన్ను పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చిన హరీశ్‌రావు.. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తమ్మినేని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.