సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు విడుదలవ్వగా.. టాలీవుడ్ లో హనుమాన్ చిత్రం విజేతగా నిలిచింది. అయితే పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా పొంగల్ కి పలు చిత్రాలు రిలీజ్ కాగా.. రెండు చిత్రాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బరిలోకి దిగితే శివ కార్తికేయన్ అయలాన్‌తో రంగలోకి దిగారు. మరి వీరిలో పొంగల్ విజేత ఎవరో తేలిపోయింది.
ఎన్నో వాయిదాల నడుమ తమిళనాడులో విడుదలైంది అయలాన్. సైన్స్ ఫిక్షన్ కథాంశం కావటంతో వచ్చిన హైప్ కాస్త వరుస వాయిదాలతో తగ్గుతూ వచ్చింది. అయితే బాక్సాఫీస్ దెగ్గర మాత్రం అయలాన్ చిత్రం అదరగొడుతుంది. స్టార్ట్ స్లో ఉన్నప్పటికీ రోజురోజుకి కలెక్షన్స్ భారీగా పెరిగి తమిళనాడులో అయలాన్ పెద్ద హిట్ గా నమోదైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో రూ.50 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకి రివ్యూలు కూడా చాలా బాగా వచ్చాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల చిత్రాలు విడుదలైన నేపథ్యంలో.. అయలాన్ సంక్రాంతికి విడుదల ఉన్నా.. థియేటర్స్ దొరకగా వాయిదా పడింది. త్వరలో అయలాన్ తెలుగు డబ్బింగ్ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ధనుష్ కెప్టెన్ మిల్లర్‌కి కూడా మంచి రివ్యూలే వచ్చినా కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత లేవు. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.35 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో శివకార్తికేయన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పొంగల్ విజేత మా హీరోనే అంటూ అయలాన్ పోస్టర్లు పెడుతున్నారు.
The post సైన్స్ ఫిక్షన్ ‘అయలాన్’ సెన్సేషన్..! appeared first on tnewstelugu.com.
