ప్రముఖ నటుడు-కమెడియన్, దిగ్గజ భారతీయ హాస్యనటుడు జానీ లివర్ కుమార్తె జామీ లీవర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ‘చోటా భీమ్’ నిర్మాత రాజీవ్ చిలక నిర్మిస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది.
ఈ విషయాన్నీ జామీ లీవర్ కన్ఫర్మ్ చేసింది. తన తోలి తెలుగు చిత్రం ఎంట్రీపై ఆమె స్పందిస్తూ, తన మాతృభాష తెలుగులో సినిమా చేస్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. టాలీవుడ్ లో చిత్రం చేయటం తన నాయనమ్మ గర్విస్తుందని.. ఆమెకి ఇదే నా ఘన నివాళి అన్నారు. ఇది నా కుటుంబానికి భావోద్వేగ సందర్భమని కూడా తెలిపింది జామీ లీవర్.
The post బాలీవుడ్ స్టార్ కమెడియన్ కుమార్తె టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరో తెలుసా ? appeared first on tnewstelugu.com.
